సెప్టెంబర్ 1న మొదలుకానున్న “మను”

  • August 29, 2016 / 01:34 PM IST

యూట్యూబ్ సెన్సేషన్ చాందిని చౌదరి టైటిల్ పాత్రలో “మధురం” అనే ఇండిపెండెంట్ ఫిలిమ్ తో యావత్ చిత్రపరిశ్రమను తన వైపుకు తిప్పుకొన్నా ప్రతిభాశాలి ఫణీంద్ర దర్శకత్వంలో రూపొందనున్న డిఫరెంట్ థ్రిల్లర్ “మను”. టాప్ ఇండియన్ టెక్నీషియన్స్ అందరూ సంయుక్తంగా పనిచేయనున్న ఈ చిత్రాన్ని “క్రౌడ్ ఫండింగ్” ఫార్మాట్ లో తెరకెక్కిస్తుండడం విశేషం.
ఇప్పటివరకూ తన అందాలతోనూ, అందమైన హావభావాలతోనూ ఆకట్టుకొన్న చాందిని చౌదరి “మను” చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషిస్తుండడం విశేషం. సాధారణంగా కెరీర్ స్టార్టింగ్ లో ఇలాంటి పాత్రలు చేయడానికి మన హీరోయిన్లు ససేమిరా అంటారు.

కానీ చాందిని కెరీర్ కంటే తనను తాను నటిగా ప్రూవ్ చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. ఆమె వెనుక క్యూ కట్టిన ఆఫర్లను కూడా కాదనుకొని “మను” కోసం ప్రిపేర్ అవుతుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రాన్ని సాంకేతికపరంగా అత్యుత్తమ విలువలతో తెరకెక్కించనున్నారు. షార్ట్ ఫిలిమ్ ఇండస్ట్రీతోపాటు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఈ సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus