నాని ‘గ్యాంగ్ లీడర్’ పై కొత్త అనుమానాలు..?

  • July 12, 2019 / 03:02 PM IST

నిర్మాతలు ఓ సంవత్సరంలో నాలుగైదు సినిమాలు చేస్తే.. రిలీజ్ విషయంలో ఎక్కడా లేని సమస్యలు ఎదుర్కొంటుంటారు. పెద్ద హీరోలతో ఎలాగూ 3, 4 సినిమాలు చేయలేరు. కాబట్టి మీడియం హీరోలతోనే ఆ సినిమాలు ఉంటాయి. దీంతో పెద్ద హీరోల సినిమాలతో పోటీకి దిగలేరు కాబట్టి సోలో రిలీజ్ కోసం చూస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారికి వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే తేజు తో చేసిన ‘చిత్రలహరి’ సినిమా చేసి హిట్టు కొట్టారు. సమ్మర్ కానుకగా విడుదల చేసినప్పటికీ అప్పటికి పోటీ సినిమాలు ఉండడంతో భారీ వసూళ్ళు ఆ చిత్రానికి రాలేదు. ఇక ‘డియర్ కామ్రేడ్’ చిత్రం రిషూట్ల కారణంగా… ఆలస్యమయ్యి ఈ జూలై 26 న విడుదల కాబోతుంది. ఇక వీరి బ్యానేర్లో నేచురల్ స్టార్ నాని తో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం చేస్తున్నారు.

నిజానికి ‘గ్యాంగ్ లీడర్’ ను ఆగష్టు మొదటి వారంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ నానికి గాయాలవ్వడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇక ఆగష్టు 15 న ‘సాహో’ లాంటి పెద్ద సినిమా ఉండడంతో ఆగష్టు 30 కి మార్చరట. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా డౌటే అంటున్నారు. నాని అలాగే డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ చిత్రం కథలో కొన్ని కీలక మార్పులు చేస్తున్నారట. దీంతో షూటింగ్ కాస్త సమయం పట్టేలా ఉందని.. దీంతో సెప్టెంబర్ కి వాయిదా పడేలా ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతుంటే.. ఎలాగైనా ఆగష్టు 30 కే విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు పట్టుదలతో ఉన్నారట. ఏమైనా ఆ తేదికి ‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ డౌట్ గానే కనిపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus