వివాదాల్లో యువ దర్శకుడు!!!

టాలీవుడ్ లో ఎంతమంది సీనియర్…మరియు కొత్త దర్శకులు ఉన్నా…తాజాగా మాసాల కధలతో…స్పైసీ స్క్రీన్‌ప్లే తో సినిమాలు చేసి హిట్స్ కొట్టిన మారుతి రూటే సేపరేట్ అని చెప్పాలి. అయితే అదే క్రమంలో మారుతి తీసిన అన్ని సినిమాల్లోకల్లా ప్రేమ కధ చిత్రం…భలే..భలే మగాడివోయ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ఇక ఆ భారీ హిట్స్ తో మారుతికి సాక్షాత్తూ విక్టరీ వెంకీ….’బాబు బంగారం’ సినిమాతో అవకాశం కల్పించాడు. కానీ మారుతి ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు….ఇదిలా ఉంటే ఇప్పటి నుంచి ఎలా అయినా బడా హీరోలతోనే సినిమాలు చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడు మారుతి. అదే క్రమంలో కధలను రెడీ చేసుకుంటూ వస్తున్నాడు…ఏమయిందో ఏమో…తెలీదు కానీ….సడన్ గా మారుతి ఒక వివాదంలో చిక్కుకున్నాడు.

అదేమిటంటే…నువ్విలా , రామ్ లీలా , జీనియస్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హవీష్ తో సినిమా చేస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు ఆ సినిమా చేయకపోవడంతో ఆ యంగ్ హీరో మారుతి తో వాగ్వాదానికి దిగాడట దాంతో ఇద్దరి మద్య గొడవ జరిగిందని టాలీవుడ్ లో గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక అసలు కారణం ఏంటి అంటే…పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనీ ఫిక్స్ అవడం తో ఇతని తో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదట. ఈ నేపథ్యం లో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసినట్లు సమాచారం. ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ…మొత్తానికి ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని మారుతి తాజాగా ఓ యంగ్ హీరోతో గొడవ పడ్డట్లు వార్తలు గుప్పు మనడంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్….చూడాలి ఈ విషయంలో నిజం ఎంత ఉందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus