ఆ హాట్ హీరోయిన్ తో వెంకీ సాంగ్!

‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొని కుటుంబ కథా చిత్రాలను కూడా తీయగలనని ప్రూవ్ చేసుకున్నాడు దర్శకుడు మారుతి. ఓవర్ నైట్ లో విక్టరీ వెంకటేష్ తో ‘బాబు బంగారం’ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలంటే ఐటెం సాంగ్ కంపల్సరీ అయిపోయింది. మారుతి కూడా వెంకీతో ఐటెం సాంగ్ లో డాన్స్ చేయించే ప్రయత్నం చేస్తున్నాడు.

హీరోను ఇంట్రడక్షన్ సాంగ్ తో పరిచయం చేయడానికి ఇష్టపడుతుంటారు దర్శకులు. అలానే మారుతి కూడా హీరో ఇంట్రడక్షన్ లో ఐటెం సాంగ్ ప్లాన్ చేశాడు. దీని కోసం హాట్ ముద్దుగుమ్మ సోనమ్ భజ్వాను సెలెక్ట్ చేసుకున్నాడు. సోనమ్ ఇప్పటికే పలు పంజాబీ, తమిళ చిత్రాల్లో నటించింది. ‘ఆటాడుకుందాం రా’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే సోనమ్ ఈ సినిమాలో వెంకీ కోసం ఆడి పాడింది. హీరోను కీర్తిస్తూ పాడే ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus