ఆ జీనియస్ ను మారుతి డైరెక్ట్ చేస్తున్నాడా..?

  • April 7, 2016 / 10:15 AM IST

ఈ మధ్యకాలంలో మారుతి బాగా ఫేమస్ అయ్యాడు. కేవలం యూత్ ను ఆకట్టుకునే సినిమాలు మాత్రమే చేయగలడని భావించిన అందరికి తను అన్ని రకాల సినిమాలను చేయగలడని ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా వెంటనే వెంకీ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. అయితే మారుతి ఇప్పుడు మరో కుర్ర హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

‘జీనియస్’ సినిమాతో పరిచయమయిన హీరో హవీష్ ప్రస్తుతం ఒక్క సినిమాలో కూడా నటించట్లేదు. తను నటించిన రెండు చిత్రాలకు ఫ్లాప్ టాక్ రావడంతో తన కెరీర్ అయిపోయిందని అనుకున్నారంతా.. అయితే ఈ హీరోను ఇప్పుడు మారుతి ఓ సినిమాలో హీరోగా తీసుకున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ కుదిర్చింది యువి క్రియేషన్స్ అట. మరి ఈ సినిమాతో అయినా హవీష్ జాతకం మారుతుందేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus