భారీ స్థాయిలో భరత్ అనే నేను ప్రీ రిలీజ్ బిజినెస్

మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే డైరక్టర్ కొరటాల శివ మరోసారి అటువంటి సినిమానే రూపొందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అను నేను సినిమా చేశారు. శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై మొదట నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఫస్ట్ ఓత్, భరత్ విజన్ లు పెంచాయి. పాటలు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ఆ క్రేజ్ కారణంగా ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు వందకోట్ల బిజినెస్ చేసింది. ఏరియాల వారీగా బిజినెస్ వివరాలు..

ఏరియా .. పలికిన ధర (కోట్లలో )
నైజాం : 22
సీడెడ్ : 12
ఉత్తరాంధ్ర : 8.7
తూర్పు గోదావరి : 6.70
పశ్చిమగోదావరి : 6
కృష్ణ, గుంటూరు : 13.6
నెల్లూరు : 3
ఆంధ్ర, తెలంగాణలో మొత్తం : 72
ఇతర రాష్ట్రాల్లో : 9
ఓవర్సీస్ : 18
ప్రపంచవ్యాప్తంగా : 99

ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 20 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus