మిడిల్ క్లాస్ అబ్బాయి నచ్చుతాడా?

  • December 21, 2017 / 06:17 AM IST

వేణు శ్రీరాం దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని చేసిన తాజా చిత్రం MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి). దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలు యువతను ఆకర్షించింది. అలనాటి ప్రముఖ హీరోయిన్ భూమిక నానికి వదినగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి ఈరోజు (డిసెంబర్ 21) థియేటర్లోకి వచ్చింది. భారీగా బిజినెస్ చేసిన ఈ సినిమాలో ఆకర్షించే అంశాలు.. ఇబ్బంది పెట్టే సంగతులపై కథనం..

నచ్చేవి
– నాని, సాయి ప‌ల్ల‌వి ట్రాక్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సన్నివేశాలు కొత్తగా ఆకట్టుకుంటున్నాయి.

– నేచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నాని ఇందులోనూ తనదైన నటనతో మెప్పించారు.
– కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ సినిమా ఫ‌స్టాఫ్ వేగంగా సాగుతోంది. ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది.
– దిల్ రాజు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కథకు తగ్గట్టు ఖర్చు పెట్టి బ్యాన‌ర్ కి మచ్చ రాకుండా చేశారు.

నచ్చనవి..
– ఇది వరకు నాని సినిమాల మాదిరిగానే ఈ కథ ఉంది. ప్రత్యేకత ఏమి లేదు.
– రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఇచ్చిన పాటలు ఎక్కడో విన్నట్టుగా అనిపించడం. బ్యాగ్రౌండ్ స్కోర్ పై కూడా పెద్ద దృష్టి పెట్టలేదు.
– సినిమా సెకండాఫ్ ఎప్పుడు పూర్తి అవుతుందా? అని ప్రేక్షకుడు ఎదురుచూసేలా ఉంది.
చివరగా ..
ప్రీమియ‌ర్ షో చూసిన వారి అభిప్రాయం మేరకు సినిమాలో ప్ల‌స్‌లు, మైన‌స్‌ లు వివరించాము. MCA తో నాని హిట్ కొట్టడం కష్టమని అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఫిల్మ్ ఫోకస్ ఫుల్ రివ్యూ రాబోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus