మీడియా కి షాక్ ఇచ్చిన చార్మీ!

  • July 27, 2017 / 06:37 AM IST

డ్రగ్స్…ఇప్పుడే ఇదే హాట్ టాపిక్..అటు మీడియా లోను…ఇటు టాలీవుడ్ లోని…ఎక్కడ విన్నా దీని గురించే మాట్లాడుకుంటున్నారు…అసలు డ్రగ్స్ ఎంత మంది తీసుకున్నారు? ఎవరెవరు ఎవరెవరికి అమ్మి సొమ్ము చేసుకున్నారు అన్న మాట పక్కన పెడితే…ఇప్పుడు మీడియా మొత్తం సినిమా వాళ్లపై పడి మరీ డ్రగ్స్ విషయంపై పూర్తి హంగామా చేస్తుంది..ఇదిలా ఉంటే ఈ కేసులో నోటీసులు అందుకున్న వారిలో కీలాకమిన వ్యక్తిగా మారిన చార్మీ ఈరోజు సిట్ ముందుకు వచ్చింది…మిగిలిన వారంతా ఫ్యామిలీ తొనో, లేక ఫ్రెండ్స్ తోనో వస్తే…చార్మీ మాత్రం….ఒక సినిమా ఫంక్షన్ కో లేదంటే ఒక షాప్ ఓపెనింగ్ కు వచ్చే విధంగా కొంతమంది బౌన్సర్లతో హడావిడి చేస్తూ సిట్ కార్యాలయానికి వచ్చింది…ఇక ఆమె అలా రావడం చూసి యావత్ మీడియా షాక్ అయ్యింది…కార్ దిగిన సమయం నుంచి లోపలికి వెళ్లే వరకు చామీ కళ్ళు ఏదో తెలియని సందేహంతో చూస్తున్నట్లుగా మీడియా చూపించడం విశేషం…అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే…ఇప్పటివరకు చాలామంది వైట్ షర్ట్స్ వేసుకుని విచారణకు వస్తే ఛార్మి మాత్రం బ్లూ కలర్ షర్ట్ వేసుకుని ఈ విచారణకు వచ్చి మరో ట్విస్ట్ ఇచ్చింది.

ఇక ఇప్పటికే చార్మీ కోర్ట్ ని ఆశ్రయించి తనకు కాస్త ఊరట కలిగే విధంగా సిట్ ముందు హాజరు అయిన విషయం తెలిసిందే…ఇక విచారణ విషయానికి వస్తే…. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆమెను విచారిస్తున్న మహిళా అధికారులు కెల్విన్ ఫోన్‌లో తన పేరును ‘ఛార్మి దాదా’ గా ఫీడ్ చేసుకోవడం పై అధికారులు ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు టాక్. దీనికితోడు ఛార్మీ కెల్విన్‌తో వాట్సాప్‌ చాటింగ్ 1000కి పైగా కాల్స్‌ చేయడం వంటి విషయాలతో పాటు మరిన్ని లోతైన విషయాలను ఎక్సైజ్‌ శాఖకు చెందిన నలుగురు మహిళా అధికారుల బృందం ఛార్మీని గుచ్చిగుచ్చి అడుగుతున్నట్లు టాక్. మొత్తంగా చూసుకుంటే చార్మీపై చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి అన్నది ఒప్పుకోక తప్పని నిజం…మరి చూద్దాం ఎవరి జాతకాలు ఎలా తెల్లారబోతున్నాయో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus