తన ప్రవర్తన తో మీడియాకు షాక్ ఇచ్చిన నవదీప్!

దాదాపుగా నాలుగు రోజుల నుంచి సిట్ ముందు ఒకరికి ఒకరుగా హాజరు అవుతున్న సినిమా సెలెబ్రెటీస్ పై మీడియా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు…అయితే అదే క్రమంలో ఈరోజు వంతు మన యువ హీరో నవదీప్ ది అవడంతో అసలు దీనిపై నవదీప్ ఏమంటాడో…ఎన్నింటికి వస్తాడో, మీడియా కి ఏం చెప్తాడో అని అనుకున్నారు అందరూ…కానీ హీరో నవదీప్ మాత్రం మీడియాకు భారీ షాక్ ఇచ్చాడు…అదేంటి అసలు మ్యాటర్ ఏంటి అంటే…ఇప్పటికే డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి పూరి, సుబ్బరాజు శ్యాం కె. నాయుడు, తరుణ్, ల వ్యవహార శైలికి భిన్నంగా నేడు సిట్ అధికారుల ముందుకు వచ్చిన నవదీప్ లుక్ లో బాడీ లాంగ్వేజ్ లో స్పష్టమైన మార్పు కనిపించింది అంటూ మీడియా వార్తలు ప్రచురిస్తుంది… అయితే ఈ వ్యవహారమే కాదు…గతంలో కూడా నవదీప్ పై ఇలాంటి ఆరోపణలు చాలానే ఉన్నాయి…వీటన్నింటినీ పరిగణించుకుని నవదీప్  ఈ రోజు ఉదయం 10.20 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చారు. అయితే…నవదీప్ వర్షన్ వినాలి అని మీడియా పొద్దున్న నుంచి నవదీప్ ఇంటి వద్ద కాపలా కాయగా…ఎక్కడ నుంచి వచ్చాడో…ఎలా వచ్చాడో తెలీదు కానీ… సిల్వర్ కలర్ పెద్ద కారులో తన తోటి మిత్రులతో కలిసి నవదీప్ సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు.

ఇక అక్కడకు వచ్చిన నవదీప్ సీరియస్ గా కార్యాలయం లోపలికి వెళ్ళడం గమనార్హం…గ్రే కలర్ ఫ్యాంట్ వైట్ కలర్ షర్ట్ తో వచ్చిన నవదీప్ తన షర్ట్ మొదటి బటన్ను వదిలేయటం ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్న అతడు తన కబ్స్ ను కాస్త మడవటం కనిపించడంతో నవదీప్ షూటింగ్ స్పాట్ కు రెడీ అయి వచ్చాడా అని అనిపించే విధంగా అతడి లుక్ కనిపించింది అంటూ మీడియా కోడై కూస్తుంది…ఇక సీరియస్ వదనంతో చకచకా లోపలికి వెళుతున్ననవదీప్ హఠాత్ గా మీడియా కెమెరాలను చూసి  తన రెండు చేతులు పైకెత్తి రాజకీయనేత తరహాలో నమస్కారం పెట్టటం పలువురికి షాకింగ్ గా మారింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే నవదీప్ తీరు…ఆయన వచ్చిన విధానం, ఆయన సీరీయస్‌నెస్ చూస్తూ ఉంటే నవదీప్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది…ఇప్పటికీ విచారణ కొనసాగుతున్న క్రమంలో…నవదీప్ పై సిట్ ప్రశ్నలు సందిస్తున్న క్రమంలో ఈరోజు సీట్ కి ఎలాంటి ఆధారాలు లభించనున్నాయో…వేచి చూడాలి. చూద్దాం మరి నవదీప్ విచారణ రిసల్ట్ ఏంటో?


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus