టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి…దాదాపుగా 8ఏళ్ల తరువాత మళ్లీ ఇండస్ట్రీలోకి వస్తున్నాడు…ఎన్నో అంచనాలు…ఎన్నో ఆలోచనలు…అభిమానుల కోలాహాలం, చిరు 150వ సినిమా కోసం ఎదురు చూపులు ఇలా ఒక్కటి…కాదు చాలానే ఉన్నాయి. అయితే అందరూ అనుకున్నట్లుగా ఈ సినిమా షూటింగ్, ఇంకా చెప్పాలి అంటే చిరు సెకెండ్ ఇన్నింగ్స్ అనుకున్నంత రేంజ్ లో సాగడంలేదు…అన్ని విషయాల్లోనూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది.
అయితే అదే క్రమంలో హీరోయిన్ విషయంలో కూడా ఎంతో మందిని సంప్రదించిన తరువాత చివరకు ‘కాజల్ అగర్వాల్’ని ఎంపిక చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ. అసలు విషయం ఇక్కడే మొదలైంది. నిన్న విడుదలయిన జనతా గ్యారేజ్ లో కాజల్ చేసిన హాట్ ఐటమ్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యరట..ఎందుకంటే…అచ్చమైన ఐటమ్ భామలా మారిపోయి అరకొర డ్రెస్ వేసుకుని బోలెడు మంది జూనియర్ ఆర్టిస్టుల చేత తన పై చేతులు వేయించుకుని మరీ రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది కాజల్.
ఇప్పుడు ఈ విషయమే చిరంజీవి అభిమానులకు చికాకు తెప్పిస్తోంది. ఒకవైపు టాలీవుడ్ ప్రెస్టీజియస్ సినిమాలలో ఒకటిగా చరిత్ర సృష్టించబోతున్న ‘ఖైదీ నెంబర్ 150’ లో నటిస్తూ ఆ సినిమా స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించ కుండా ‘నేను పక్కా లోకల్’ అంటూ చిందులు వేసిన కాజల్ ను చిరంజీవి పక్కన హీరోయిన్ గా ఎలా చూసేది అని మెగా అభిమానులు తల పట్టుకుంటున్నట్లు టాక్. వారి వాదనలో నిజం ఉంది కానీ, చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ కామన్ అని సరిపెట్టుకోవాల్సిందే.