విచిత్ర వేషధారణలో ఆకట్టుకున్న మెగా కుటుంబ సభ్యులు

  • October 27, 2018 / 06:21 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైతే మొహానికి రంగువేసుకున్నారో.. అప్పటి నుంచే ఆ కుటుంబ సభ్యులు మేకప్ తమ జీవితంలో భాగం చేసుకున్నారు. ఆడ మగ అని తేడా లేకుండా సినీ పరిశ్రమలో పనిచేయడానికి ఆసక్తికనబరిచారు. ఒక వృత్తిగా కాకుండా నటనంటే దైవంగా ఆ కుటుంబ సభ్యులు భావిస్తుంటారు. తాజాగా హాలీవుడ్ లో ఎక్కువగా జరుపుకునే “హాలోవీన్” వేడుకను మెగాస్టార్‌ కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. విచిత్ర వేషధారణలో సందడి చేశారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి, ఉపాసన, వరుణ్‌తేజ్‌, నిహారిక, సుస్మిత, శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ తదితరులు భయంకరమైన గెటప్‌లలో కనిపించారు. ముఖానికి రంగు వేసుకుని, విచిత్రమైన దుస్తుల్లో పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అత్తా కోడళ్ళు సైతం వినోదాన్ని పంచారు. తన అత్త సురేఖను భయపెడుతున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. “ఎంతో మంచి అత్తమ్మ, భయంకరమైన కోడలు. ‘హాలోవీన్’ పార్టీ'” అని కామెంట్ చేశారు. ‘హాలోవీన్‌’ వేడుకలు అక్టోబరు 31వ తేదీతో ముగియనున్నాయి. మెగా ఫ్యామిలీ ఫొటోను చూస్తే రామ్‌చరణ్‌ దీక్షలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మాత్రం సంప్రదాయ దుస్తుల్లో ఫ్యామిలీతో కలిసి ఫొటోకు పోజిచ్చారు. ఇటువంటి ‘హాలోవీన్‌’ వేడుకల్లో మెగా కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం ఇదే తొలిసారి. వేడుక అయినప్పటికీ అందరూ భయపెట్టిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus