మెగా ఫ్యామిలీ నన్ను అవమానపరచింది!!!

టాలీవుడ్ టాప్ హీరలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన మెగా ఫ్యామిలీకి కీలక నాయకుడు మెగాస్టార్ చిరంజీవి…ఆయన కుమారుడు, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరన్ ఇద్దరూ కలసి తనని అవమానించాడు అని చెబుతున్నాడు ఒక కోలీవుడ్ యాక్టర్…ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు…మెగా ఫ్యామిలీతో గొడవ ఏంటి అంటే…మన ఒకసారి ఈ కధ చదివితే మనకే అర్ధం అవుతుంది…విషయంలోకి వెళితే…పందెం కోడి సినిమా చూశాం కదా…అందులో హీరో విశాల్ కి తండ్రిగా నటించిన కోలీవుడ్ యాక్టర్ రాజ్ కిరణ్…టాలీవుడ్ లో పెద్దగా ఈ వ్యక్తి అంటే ఎవ్వరికీ తెలియాయకపోయినా కోలీవుడ్ మంచి యాక్టర్ గా పేరు ఉంది…అయితే ఇప్పుడు ఇతగాడే తనను మెగా ఫ్యామిలీ అవమానించింది అంటూ మైక్ ముందు చెబుతున్నాడు…విషయంలోకి వెళితే…మూడు సంవత్సరాల క్రితం రామ్ చరణ్ కృష్ణవంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటిస్తున్న నేపధ్యంలో అప్పట్లో చరణ్ కు తాతగా రామ్ కిరణ్ ను ఎంపిక చేయడమే కాకుండా ఆయనతో ఈసినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడ పూర్తి చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత చరణ్ తాతగా రాజ్ కిరణ్ నటన బాగా లేదు అంటూ ఆయనను తొలగించి ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ ను పెట్టి రీ షూట్ చేసారు. అప్పట్లో ఆ న్యూస్ సంచలనం. అయితే ఎందుకు గుర్తోచిందో తెలీదు కానీ…అయిపోయిన విషయాన్ని ఈ యాక్టర్ మళ్లీ తిరగ తొడుతున్నాడు…..కోలీవుడ్ హీరో ధనుష్ డైరెక్ట్ చేస్తున్న ‘పా పాండి’ మూవీ ప్రమోషన్ లో భాగంగా రాజ్ కిరణ్ కోలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అప్పుడు ఎప్పుడో తనకు టాలీవుడ్ లో చిరంజీవి రామ్ చరణ్ వల్ల జరిగిన అన్యాయాన్ని వివరైంచాడు…అయితే చెర్రీపై విమర్శలు చేస్తూనే…..ఆ మూవీలో తనను తొలిగించిన విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది చిరంజీవి కూడా అని ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు…అంతేకాదు….తనకు ఎటువంటి కారణాలు చెప్పకుండా తనను ఆ సినిమా నుండి తొలిగించడమే కాకుండా కనీసం తనకు ఇవ్వవలసిన పారితోషికం కూడా ఇవ్వకుండా ఆ సినిమా నిర్మాత బండ్ల గణేష్ అవమాన పరిచాడు అంటూ విమర్శలు గుప్పించాడు….ఎప్పుడో మరచిపోయిన కధని ఈ యాక్టర్ మళ్లీ ఎందుకు తెరపైకి తెచ్చాడో ఆయనకే తెలియాలి…


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus