‘సుమా’ను మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందా?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో, బుల్లి తెర యాంకర్ గా సుమకి సైతం అంతే తెరు ఉంది. అయితే ఆది అదే…ఇది ఇదే అనుకోండీ…ఇంతకీ విషయం ఏమిటంటే….సుమా కనకాల బుల్లి తెరపై, స్టేజ్ షోస్ లో, టాప్ స్పీడ్ లో దూసుకుపోతున్న యాంకర్. అయితే దాదాపుగా ప్రతీ ఇవెంట్, ప్రతీ హీరో సుమా కనకాల తన షో హోస్ట్ చెయ్యాలి అని కోరుకునే అంత టాప్ యాంకర్ గా మారింది సుమా. అదే క్రమంలో మెగా ఫ్యామిలీ సైతం ఎటువంటి మెగా ఈవెంట్ జరిగినా కూడా యాంకరింగ్ అంతా సుమ చేతుల్లోనే పెట్టేస్తున్నారు. పైగా సుమ ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తున్న షోలలో కూడా మెగా హీరోలు బాగానే పాల్గొంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అంగరంగా వైభవంగా జరిగిన మెగాస్టార్ 61వ జన్మధిన వేడుకలలో సుమా కనిపించలేదు, అదే క్రమంలో ఆ స్థానంలో శ్యామల కనిపించింది.  సుమా కనిపించకపోవడం పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాకపోయినా ప్రస్తుతం సుమకు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. అసలు ఆవిడ యాంకరింగ్ చేయాల్సిందే.. లేకపోతే ఆ ప్రోగ్రామ్ కు విలువేలేదు అనేంతగా పరిస్థితి మారిపోవడంతో ఈ విషయంపై టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. ఇంతకీ సుమా కనిపించకపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా…కావాలనే మెగా ఫ్యామిలీ సుమను పక్కన పెట్టింది.  సుమతో యాంకరింగ్ కావాలనే చేయించలేదు అని తెలుస్తోంది.

ఎందుకంటే అది ఫ్యాన్స్ చేస్తున్న బర్త్ డే వేడుక అని రామ్ చరణ్ పైకి ఆర్భాటంగా చెప్పినప్పటికీ…ఖర్చంతా మెగా కాంపౌండ్ నుండే వెళ్ళింది అనేది ఒప్పుకోక తప్పని నిజం. అయితే అలాంటి సమయంలో మరీ ఖరీదైన యాంకర్ సుమను పిలిస్తే.. ఖచ్చితంగా అందరికీ ఆ సీక్రెట్ లీక్ అయిపోతుంది అని మన చెర్రీ అలా ప్లాన్ చేసాడంట.. అందుకే మనోళ్ళు శ్యామలతో సరిపెట్టేశారని తెలుస్తోంది.  ఏది ఏమైనా…మొత్తానికి మెగా ఫ్యామిలీ ఇలా సెటల్మెంట్ చేసింది అన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus