వినయ విధేయ రామ ఫ‌స్ట్ లుక్ పైన నిరాశ చెందిన మెగా అభిమానులు!

  • November 6, 2018 / 01:37 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కైరా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి దాన‌య్య నిర్మిస్తున్న సినిమా వినయ విధేయ రామ. రామ్ చరణ్ తేజ్ రంగస్థలం వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమా తరువాత ఈ సినిమా చేస్తుండటం, మరోపక్క పక్క మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈ సినిమా ఉండటంతో క్రేజీ కాంబినేషన్ గా అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి. సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా అభిమానుల కోసం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది.

ఇక అభిమానులు వీరి కాంబినేషన్ పైన ఎన్నో అంచనాలు పెట్టుకోగా ఫస్ట్ లుక్ లో గ్రాఫిక‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారని కాస్త నిరాశ చెందారు. అసలు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో బోయపాటి చరణ్ ని ఒక రేంజ్ లో చూపించే ఫస్ట్ లుక్ ని ఊహించుకుంటే రొటీన్ గా వుందటూ కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేసారు. ఇది ఇలా ఉంటె, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని నవంబర్ 9 న విడుదల చేయనున్నారు. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ఏ రేంజులో ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus