ఆ బాబు తేజ్ తీసేశాడు, ఈ బాబు ధరమ్ తీసేశాడు

  • April 23, 2019 / 06:54 PM IST

సెంటిమెంట్స్ ను నమ్మడంలో మన తెలుగోళ్ళు ముందుంటారు ఆనండంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆ సెంటిమెంట్ కు ఎంత వేల్యూ ఇస్తారు అని ప్రత్యేకంగా చెప్పాలా? అందుకు మెగా ఫ్యామిలీ హీరోలు బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పట్లో రామ్ చరణ్ తేజ్ రెండు ఫ్లాపుల తర్వాత తన పేరులోని తేజ్ ను తీసి పక్కన పెట్టేశాడు. అప్పట్నుంచి మనోడి పేరు రామ్ చరణ్ అని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా ఆరు ఫ్లాపుల తర్వాత “చిత్రలహరి” కోసం తన పేరును “సాయి తేజ్” అని మార్చుకున్నాడు. లక్కీగా సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు సాయి తేజ్ బాబు.

అందుకే.. ఇకపై అన్నీ సినిమాల్లోనూ తన పేరును సాయి తేజ్ అనే వేయించుకుంటాడట. కుదిరితే.. సోషల్ మీడియాలోనూ తన పేరును సాయిధరమ్ తేజ్ నుంచి సాయి తేజ్ గా మార్చుకోవాలనుకొంటున్నాడట తేజ్. మరి చరణ్ కి తేజ్ తీసేసిన తర్వాత కెరీర్ లో సెటిల్ అయినట్లు.. తేజ్ కి తన పేరులో ధరమ్ తీసేసిన తర్వాత ఏమైనా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus