సింగిల్ టేక్ లో సాంగ్ పూర్తి చేసిన మెగాస్టార్

  • June 11, 2016 / 11:23 AM IST

మెగాస్టార్ చిరంజీవి తన పాటలకు మరోసారి స్టెప్పులు వేశారు. సింగల్ టేక్ లోనే ఒకే చేసి ఇప్పటికీ తన స్టామినా తగ్గ లేదని నిరూపించారు. సాంగ్ ఏంటి ? ఒకే ఏంటి ? అనుకుంటున్నారా ? .. చెబుతాను కూల్ గా చదవండి. “మా టీవీ” వారు ప్రతి ఏడాది విడుదలైన తెలుగు సినిమాల్లో బెస్ట్ గా నిలిచిన వాటికి అవార్డులు ఇస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అవార్డుల వేడుక నిర్వహించనున్నారు. స్టార్ కంపనీ “మా టీ వీ”ని సొంతం చేసుకున్నతర్వాత తొలిసారిగా జరుతున్నసంబరం కావడంతో దీనిని మరింత గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకలో నేటి తెలుగు హీరోయిన్ లతో పాటు మెగా స్టార్ చిరంజీవి కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్లో చిరంజీవి నటించిన 149 సినిమాల్లోని హిట్ పాటల్లో కొన్నింటికి డ్యాన్స్ వేస్తారు.

అయితే కొన్నిపాటలను ముందుగానే ఏవీ ద్వారా చూపిస్తారు. ఆ ఏవీ కోసం చిరు ముఠామేస్త్రి, ఇంద్ర వంటి సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ వేసారు. ఈ షూట్ లో మెగాస్టార్ సింగల్ టేక్ లోనే సాంగ్ ని ఒకే చేయించారు. చిరు 150వ సినిమా కత్తిలాంటోడు సెట్స్ మీదకు వెళ్లేముందు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఉపయోగ పడుతుందని చిరంజీవి భావించారట. తన పెర్ ఫార్మెన్స్ ను, స్క్రీన్ ప్రెజెన్స్ ను ఓసారి చెక్ చేసుకోవచ్చని ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం జూన్ 12న హైటెక్ సిటీ లోని హెచ్ఐసిసిలో జరగనుంది. ఇందుకు సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రమే హాజరవుతారు. మా టీవీ లో ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయం ఇంకా చెప్పలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus