మెగాస్టార్ తో బోయపాటి సినిమా..వర్కౌట్ అయితే బాక్సులు బద్దలే..!

  • October 26, 2020 / 05:50 PM IST

బోయపాటి శ్రీను మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్. ‘మంచి కన్విక్షన్ ఉన్న డైరెక్టర్ అని’ కూడా మన మెగాస్టార్ చిరంజీవి గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆయన డైరెక్షన్లో సినిమా చేస్తే.. హీరోలంతా బాగా ఎంజాయ్ చెయ్యొచ్చని.. కచ్చితంగా ఆయనతో ప్రతీ హీరో.. వర్క్ చెయ్యాలని కూడా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా చెప్పుకొచ్చాడు. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ప్రస్తుతం బోయపాటి శ్రీను.. బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు.

ఆ చిత్రానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను బాలయ్య పుట్టినరోజు నాడు విడుదల చెయ్యగా దానికి రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ చిత్రం పూర్తయ్యాక దిల్ రాజు నిర్మాణంలో బోయపాటి సినిమా ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే హీరో ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోపక్క.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉంటుందని మళ్ళీ టాక్ నడుస్తుంది. బోయపాటితో సినిమా చెయ్యడానికి మెగాస్టార్ ఎప్పటి నుండో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఈ కాంబినేషన్ ను ‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో సెట్ చేస్తానని గతంలో అల్లు అరవింద్ గారు చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమలో ఏదైనా సాధ్యమే కాబట్టి.. బోయపాటి శ్రీను మంచి స్క్రిప్ట్ తో మెగాస్టార్ ను అప్రోచ్ అయితే.. ఈ కాంబో వెంటనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus