మహా నటుడు నందమూరి తారక రామారావు సినీ పరిశ్రమకు చేసిన సేవలు దేశం మొత్తం గుర్తించుకునేలా తెలంగాణ ప్రభుత్వం నూతన నిర్ణయం తీసుకోనుంది. ఆయన పేరిట ఉత్తమ సినీ కళాకారునికి జాతీయ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నంది పురస్కారాలుండగా తెలంగాణ ప్రత్యేకంగా అందజేయనున్న పురస్కారాలు ‘సింహం’ రూపంలో.. మొత్తం నలభై విభాగాల్లో ఉండాలని సూచించింది. తెలుగు సినీ ప్రముఖుడికి రఘుపతి వెంకయ్య పురస్కారం, తెలంగాణ సినీ ప్రముఖుడికి కాంతారావు పురస్కారం ఇవ్వాలని భావిస్తోంది.
ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, నిపుణుల కమిటీ ఆరు నెలలు విస్తృత స్థాయిలో చర్చించి అవగాహనకు వచ్చింది. మంగళవారం జరిగిన సమావేశంలో సిఫార్సులను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అందజేసింది. మంత్రి ఈ ఫైల్ ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుధవారం పంపించారు. ఇందులోని అంశాలను ముఖ్యమంత్రి పరిశీలించి తుది నిర్ణయాన్ని త్వరలో వెల్లడించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.