విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నిజ జీవితంలో మామా అల్లుళ్ళు అయిన వెంకటేష్, చైతన్యలు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. వారి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇక తాజాగా ఈ చిత్రం చూసిన మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… ” ‘మా ఫ్యామిలీ మొత్తం ‘వెంకీ మామ’ సినిమాను చూశాం. ఈ సినిమా మాకు బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేశాం. దానికి ప్రధాన కారణం.. నా మిత్రుడు వెంకటేష్. తన స్టైల్లో కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్స్ సీన్స్ తో అద్భుతంగా రాణించి, మెప్పించి, ఒప్పించారు. చాలా కాలం తర్వాత యాక్షన్ సన్నివేశాల్లో కూడా ‘వావ్’ అనిపించారు. ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణమైన వెంకటేష్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. మామకు తగ్గ అల్లుడిగా నాగచైతన్య కూడా చాలా మెచ్యూర్డ్ గా పెర్ఫామ్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ లో చైతన్య కూడా భాగస్వామి అయ్యాడు. దర్శకుడు బాబీ తన స్టైల్లో ఆద్యంతం సినిమాను రసవత్తరంగా నడిపించాడు. ఈ సినిమా ఇంతటి సక్సెస్ ను సాధించినందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.
వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!