Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన కీలక విషయాలను లీక్ చేయడంలో ముందుంటారు. ‘రంగస్థలం’లో ఆది పినిశెట్టి క్యారెక్టర్, ‘ఆచార్య’ టైటిల్ లీక్ చేసింది ఆయనే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు ఇంకా చాలా ఈవెంట్లలో ఆయన లీక్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో. అందుకే ఆయనతో సినిమాలు తీసే దర్శకులు తెగ టెన్షన్ పడుతుంటారు. ఇటీవల తన ‘కాకా'(Kaaka) సినిమా టైటిల్ వెనుక ‘కదిరి కాళిదాస్’ అనే మీనింగ్ ఉందని లీక్ చేసింది కూడా చిరునే.

Kaaka

ఇదిలా ఉంటే.. ఈరోజు ఆయన ‘ఇట్లు అర్జున’ సక్సెస్ మీట్‌కి హాజరయ్యారు. ఈ వేడుకలో కూడా చిరు ఓ లీక్ వదిలారు. ఈ సినిమాలో అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆమె ‘కాకా’లో కూడా నటిస్తోంది. ఈ ఈవెంట్‌లో చిరు అనశ్వర పాత్ర గురించి చెబుతూ, ఆమెకు మైక్‌లో మాట్లాడటం ఇష్టం లేదని, మాట్లాడదని అన్నారు. ఆ మాటల అర్ధాన్ని అందరూ ఇంటికి వెళ్ళాక ఇంకోసారి నెమరువేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది అని నొక్కి చెప్పారు.

చిరు మాటలని బట్టి చూస్తే.. అనశ్వర పాత్ర ‘కాకా’ సినిమాలో ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చేసినట్టే..! అయితే ఆమె ‘కాకా’ సినిమాలో మూగ పాత్రలో నటిస్తుందని అనుకోవచ్చు. లేదు అంటే తండ్రి పాత్ర పోషిస్తున్న చిరుతో మాట్లాడటం ఇష్టం లేని అమ్మాయిగా కనిపించబోతుందని అర్ధం చేసుకోవచ్చు. సొ ఆడియన్స్ ను చిరు ఆమె పాత్రకి ప్రిపేర్ చేసేసినట్టే అనుకోవాలి.

తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus