డా: టి. సుబ్బారామిరెడ్డి ని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

  • August 22, 2018 / 10:14 AM IST

* మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డా: టి. సుబ్బారామిరెడ్డి.
* ‘సైరా నరసింహారెడ్డి’ కి ప్రశంసలు
– సుప్రసిద్ధ నిర్మాత, డా: టి. సుబ్బరామిరెడ్డి, ఎం.పి. రాజ్యసభ

కళాబంధు డా: టి. సుబ్బారామిరెడ్డి కి ఇటీవల విదేశాలలో మోకాలు కి శస్త్ర చికిత్స జరిగింది. నగరానికి విచ్చేసిన సుబ్బారామిరెడ్డి ని ఆయన స్వగృహంలో మెగాస్టార్. చిరంజీవి పరామర్శించారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు డా: టి. సుబ్బారామిరెడ్డి. ఈ సందర్భంగా చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని, సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతుందని డా: టి. సుబ్బారామిరెడ్డి అభిలషించారు. అలాగే చిత్ర సమర్పకురాలు శ్రీమతి శ్రీ సురేఖ గారికి, చిత్ర నిర్మాత రాంచరణ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డి కి చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus