తమిళ బ్యూటీ మేఘ ఆకాష్ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. యువ హీరో నితిన్ తో కలిసి లై సినిమాలో హిరోయిన్‌గా పరిచయమైంది. ఇది విజయం సాధించలేదు. ఇక్కడ ఎంట్రీ బాగాలేదని తమిళంలో అదృష్టం పరీక్షించుకోవాలని “ఏను నోకి పాయం” అనే సినిమా చేసింది. ఇది కూడా నిరాశపరిచింది. మరో సారి అదృష్టం పరీక్షించుకోవాలని మళ్ళీ నితిన్ కి జోడీగా నటించింది.
ఛల్ మోహన్ రంగా సినిమా కోసం కష్టపడింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో మేఘ పూర్తిగా అప్ సెట్ అయిపోయింది. ఇక నటనకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఇలా బాధలో ఉన్న మేఘ మంచి ఆఫర్ తలుపుతట్టింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో అవకాశం అందుకుంది. ప్రస్తుతం రజినీ నటించిన కాలా సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగంల్ ఇచ్చారు.
ఇందులో సిమ్రాన్, బాబీ సింహ, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర కోసం మేఘ ఆకాష్ ని సంప్రదించారు. కథ, అందులో తన రోల్ బాగా ఉండడంతో ఆమె సంతోషంగా ఓకే చెప్పింది. ఈ చిత్రమైన ఆమె కెరీర్ స్పీడ్ పెంచుతుందో లేదో చూడాలి.