నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నితిన్ హీరోయిన్

  • January 18, 2019 / 01:28 PM IST

కార్తికేయ నటించిన మొదటి సినిమా “ప్రేమతో మీ కార్తీక్” అనే సినిమా విడుదలైందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అలాంటి కార్తికేయ సెకండ్ సినిమా “ఆర్ ఎక్స్ 100″తో స్టార్ హీరో అయిపోయాడు. ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా మొదలెట్టాడు కార్తికేయ. బోయపాటి శిష్యుడు జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయిక ఎవరనే విషయం నిన్నటివరకూ చిన్న కన్ఫ్యూజన్ చోటు చేసుకొంది. టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించనుందని వార్తలొచ్చినప్పటికీ ఆమె ఫైనల్ అవ్వలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ ముద్దుగుమ్మ అనఘను ఫైనల్ చేశారట. ఇటీవలే మలయాళంలో డెబ్యు చేసిన అనఘకి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ కారణంగానే ఆమెను ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయనున్నారు. అనఘ ఆల్రెడీ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటోలతో కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. మరి ఈ మలయాళ ముద్దుగుమ్మ తన సీనియర్స్ అయిన సాయిపల్లవి, కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూల్ లాగా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus