అవకాశాలు లేకపోయినా ఇంత డిమాండ్ చేస్తుందేంటి…?

  • May 28, 2019 / 04:19 PM IST

కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లందుకున్న మెహ్రీన్ ఏకంగా ‘గోల్డెన్ లెగ్’ అనే పేరును సంపాదించుకుంది. అయితే ఆ పేరు ఎంతోకాలం నిలబడలేదు. తరువాత ఆమెకు వరుస ప్లాపులు వచ్చాయి. దీంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఎఫ్2’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఈమెకు మళ్ళీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా అని అవి పెద్ద సినిమాలు మాత్రం కాదు. మీడియం సినిమాలే…! ప్రస్తుతం నాగ‌శౌర్య చిత్రంలో నటిస్తుంది మెహ్రీన్. ఈ చిత్రం కోసం ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే.

నాగ‌శౌర్య సొంత బ్యానర్ అయిన ‘ఐరా క్రియేషన్స్’ లో ‘అశ్వ‌ద్ధామ‌’ అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మెహ్రీన్ ను ఎంచుకున్నారు. అయితే ఈ చిత్రం కోసం ఆమె 80 లక్షలు డిమాండ్ చేసిందట. అయినా నిర్మాతలు వెనుకడుగు వేయలేదంట. ఆమె అడిగింది ఇవ్వడానికి రెడీ అయిపోయారని తెలుస్తుంది. సాధారణంగా ఒక్కో సినిమాకు మెహ్రీన్ తీసుకునే రెమ్యూనరేషన్ 50 లక్షలు కాగా ఈ చిత్రానికి ఇంత ఎలా డిమాండ్ చేసింది..? ఇందుకు నిర్మాత ఎలా అంగీకరించాడు అనేది చర్చనీయాంశం అయ్యింది. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మికను అనుకున్నారట. రష్మిక ను హీరోయిన్ గా పరిచయం చేసింది కూడా నాగ‌శౌర్యనే..! కానీ ఈసారి రష్మిక నితిన్ చిత్రానికి.. అది కూడా ‘ఛలో’ దర్శకుడి చిత్రానికే కమిట్మెంట్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus