ఆ హీరోయిన్ ప్రవర్తన మారడానికి అసలు కారణం అదే..?

చూడటానికి జూనియర్ కాజల్ లా ఉంటుంది మెహ్రీన్. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ భామ ‘గోల్డెన్ లెగ్’ గా పేరు తెచ్చుకుంది. అయితే తరువాత ఈమెను వరుస ప్లాపులు వెంటాడటంతో.. ఆఫర్లు కరువయ్యాయి. ఇలా కిందా.. మీదా పడుతున్న తరుణంలో ‘ఎఫ్2’ చిత్రం ఈమెకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. దీంతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈమె పెద్దగా సినిమాలు నటించడం లేదు. దీనికి కారణం ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడమే అని టాక్ నడిచింది. అయితే దీనికి అసలు కారణం అది కాదంట.. వేరే ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. మెహ్రీన్ సినిమా వ్యవహారాలు మొత్తం ఇప్పుడు ఆమె తల్లి దగ్గరుండి చూసుకుంటుందట. ఈ క్రమంలో మెహ్రీన్ తన మేనేజర్ ను కూడా తీసేసిందట. సెట్లో మెహ్రీన్ వ్యవహారాలు మొత్తం ఆమె తల్లే చూసుకుంటుందట. దర్శక నిర్మాతలు కథలు చెప్పాలన్నా ముందు మెహ్రీన్ తల్లి పర్మిషన్ తీసుకోక తప్పదంట. ప్రస్తుతం మెహ్రీన్… నాగ శౌర్య కు జంటగా ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం కోసం ఆమె ఏకంగా 80 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. గతంలో 40 లక్షలు మాత్రమే తీసుకునే మెహ్రీన్ ఇప్పుడు ఇంత డిమాండ్ చేయడం వెనుక కూడా ఆమె తల్లి హస్తం ఉందని ఫిలింనగర్లో చర్చలు మొదలయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus