ఇకనైనా కాన్సన్ ట్రేట్ చేయకుంటే కష్టం!

ఒక్కోసారి హీరోయిన్లు వరుసగా ఆఫర్లు వస్తున్నాయన్న ఆనందంతోనో లేక గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొనడం వల్లనో తెలియదు గానీ.. ఉన్నట్లుంది వీరాలెవల్లో లావైపోతుంటారు. అప్పట్లో రాశీఖన్నా “ఊహలు గుసగుసలాడే” చిత్రంలో ముద్దుగా బొద్దుగా ఉందని అందరూ మెచ్చుకొనేలోపే.. “బెంగాల్ టైగర్, హైపర్” చిత్రాల్లో లావుగా తయారై.. నమితను తలపించింది. కానీ.. తన తప్పును త్వరగా తెలుసుకొన్న రాశీ వెంటనే జిమ్ లో కాసేపు ఎక్కువ కష్టపడి కొవ్వు కరిగించి.. “జై లవకుశ”లో సూపర్ స్లిమ్ గా దర్శనమిచ్చి అందర్నీ మెప్పించింది.

ఇప్పుడు మెహరీన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. “కృష్ణగాడి వీరప్రేమగాధ”తో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తొలి చిత్రంతో నటనతో ఆకట్టుకొంది. ఆ తర్వాత “మహానుభావుడు” చిత్రంతో అందాలతో అలరించింది, ఆ సినిమాకే కాస్త లావయ్యింది. ఇక “రాజా ది గ్రేట్”లో సన్నబడ్డ రవితేజ పక్కన పెద్దక్కలా కనిపించిన మెహరీన్ ను చూసి షాకైనా వారి సంఖ్యే ఎక్కువ. ఇక నిన్న విడుదలైన “జవాన్”లో మెహరీన్ ను చూసినవాళ్ళందరూ రంభలా తయారయ్యిందేమిటి అనుకొంటున్నారు. ఇక “బుగ్గంచున” అనే పాటలో ఎర్ర చీరలో మెహరీన్ లూజ్ బాడీని చూసినవాళ్ళందరూడ్.. అమ్మాయి అర్జెంట్ గా జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేయకపోతే కెరీర్ త్వరలోనే షెడ్ కి వెళ్ళడం ఖాయం అంటుండడాన్ని మెహరీన్ గమనిస్తే మంచిది. మరి ఈ విషయాన్ని మెహరీన్ సీరియస్ గా తీసుకొంటుందో లేక లైట్ తీసుకొని ఇలాగే లావైపోతూ ఉంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus