ఘనంగా మెహరీన్‌ నిశ్చితార్థం, వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు!

  • March 13, 2021 / 01:26 PM IST

“కృష్ణగాడి వీరప్రేమ గాధ” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. తొలి సినిమాతోనే నటిగా విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడికి ఆ తర్వాత ఎందుకో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. అందుకు కారణాలు చాలా ఉన్నప్పటికీ.. ముఖ్యమైన కారణం మాత్రం అమ్మడు కాస్త బొద్దుగా అవ్వడమే. ఇక టైంవేస్ట్ అనుకుందో లేక ఆఫర్లు రావని ఫిక్స్ అయిపోయిందో తెలియదు కానీ.. యంగ్ ఏజ్ లోనే పెళ్ళికి రెడీ అయిపోయింది. మెహరీన్ తల్లి పొలిటీషియన్ కావడంతో, పంజాబ్ కి చెందిన లోకల్ పొలిటికల్ లీడర్ తోనే మెహరీన్ పెళ్ళి ఫిక్స్ చేసింది.

తాజాగా ఈ అందాల భామ నిశ్చితార్థం ఆమె ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో ఘనంగా జరిగింది. జైపూర్‌లోని ఓ కోట వీరి నిశ్చితార్థ వేడుకకు వేదికైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది మెహరీన్‌. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనుందని సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus