యువ హీరో సరసన మెహ్రీన్?

  • May 10, 2019 / 04:44 PM IST

‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అందమైన భామ మెహ్రీన్ పిర్జాధా. మొదట్లో వరుస హిట్లతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే తరువాత వచ్చిన ‘కేర్ అఫ్ సూర్య’ ‘జవాన్’ ‘పంతం’ ‘కవచం’ వంటి వరుస డిజాస్టర్లు పడటంతో ఈ అమ్మడికి ఆఫర్లు కరువయ్యాయి. ఇటీవల వచ్చిన ‘ఎఫ్ 2’ చిత్రం బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అమ్మడు 5 నెలలు ఖాళీగానే గడిపింది. ఇప్పటి వరకూ ఆమెకు ఆఫర్లు పెద్దగా రాలేదు. ఎట్టకేలకు ఈ అమ్మడికి ఓ ఆఫర్ వచ్చిందట.

తమిళ దర్శకుడు ‘తిరు’ డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో ఈమె హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈమెకు మరో క్రేజీ ఆఫర్ దక్కిందట. నాగశౌర్య హీరోగా తన సొంత బ్యానర్ అయిన ‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నారని సమాచారం. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందే ఈ చిత్రంతో ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడట. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న నాగశౌర్య, అది పూర్తికాగానే తన కొత్త ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus