విజయ్ దేవరకొండ కి జోడీగా నటించనున్న మెహ్రీన్

  • March 3, 2018 / 09:30 AM IST

పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో తెలుగువారి అభిమాన హీరోయిన్ అయింది. ఆమె కోసం అనేక కథలు రెడీగా ఉన్నా.. ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా మంచి ఛాన్స్ అందుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో అతను నటించిన “టాక్సీవాలా”, “ఏ మంత్రం వేశావే” సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో మరో సినిమా చేస్తున్నారు. శ్రీరస్తు శుభమస్తుతో హిట్‌ కొట్టిన పరశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతున్న సినిమాని బన్ని వాసు నిర్మిస్తున్నారు. ఇందుకు “గీతా గోవిందం” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా తమిళంలోనూ నటించడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఇందులో హీరోయిన్ గా మెహ్రీన్ సెలక్ట్ అయింది. విజయ్ తో కలిసి సినిమా చేయడం మెహ్రీన్ కి కలిసి వస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరులో మొదలుకానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus