మెహరీన్ కు అవకాశాల కోసం సన్నబడకతప్పలేదేమో.!

అందం, అదృష్టం, అభినయం వంటి అంశాలన్నీ పుష్కలంగా ఉన్న హీరోయిన్లకు కూడా ఒక్కోసారి గ్రహచారం బాగోలేకో లేక కథల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వలనో తెలియదు కానీ.. సరైన అవకాశాలు దక్కించుకోలేక వెనుకబడిపోతుంటారు. ఆ విధంగా అందం, అభినయ సామర్ధ్యం అన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ.. సరైన దేహాకృతిని మెయింటైన్ చేయకపోవడం వలన ఆఫర్లు కోల్పోయిన నటి మెహరీన్. తొలి చిత్రమైన “కృష్ణగాడి వీరప్రేమగాధ”తో కథానాయికగా మంచి హిట్ అందుకోవడంతోపాటు మంచి పేరు కూడా సంపాదించుకొన్న మెహరీన్ అనంతరం తన బాడీని కంట్రోల్ చేసుకోకపోవడం, సరైన షేప్ లేకపోవడంతో చాలా సినిమాల ఆఫర్లు కోల్పోవాల్సి వచ్చింది.

కష్టపడి దక్కించుకొన్న కొన్ని సినిమాలైన “రాజా ది గ్రేట్, మహానుభావుడు” చిత్రాల్లో అమ్మడి అందం గురించి కంటే మందం గురించి జనాలు ఎక్కువగా మాట్లాడడంతో హార్ట్ అయ్యిందో లేక ఇలాగే ఉంటే ఆఫర్లు రావని గ్రహించిందో తెలియదు కానీ సడన్ గా కొన్నాళ్లపాటు సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి గట్టిగా జిమ్మే చేసిందో లేక ఏదైనా డైట్ ఫాలో అయ్యిందో తెలియదు కానీ.. సన్నగా నాజూకు నడుముతో దర్శనమిచ్చింది. ఇప్పుడు మెహరీన్ ను చూసినవాళ్ళందరూ అమ్మాయి భలే ఉందే అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే.. అమ్మడి తాజా చిత్రం “F 2” రెగ్యులర్ షూట్ జూన్ నుంచి మొదలవ్వనుంది. ఈ మల్టీస్టారర్ లో మెహరీన్ హిట్ హీరో వరుణ్ తేజ్ కు జంటగా కనువిందుచేయనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus