సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ లేటెస్ట్ ఫిల్మ్ కబాలి పై భారీ అంచనాలున్నాయి.తాజాగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కబాలి మలయాళీ రైట్స్ ను సొంతం చేసుకోవడంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగింది. తలైవా మూవీ కోసం అభిమానులు ఎదురు చూడడంలో విశేషం ఏమిలేదు. కానీ కేరళలో సూపర్ స్టార్ హోదా కలిగిన హీరో.. మరో హీరో చిత్రం రైట్స్ కోసం ఎగబడడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది.
కేరళ డిస్ట్రిబ్యూటర్స్ తో పోటీ పడి ఎక్కువ మొత్తం చెల్లించి కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను మోహన్ లాల్ దక్కించుకున్నారు. దీంతో రజనీ అభిమానులతో పాటు కబాలి చిత్ర బృంద సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ లాల్ స్టార్ డమ్ కూడా కబాలి చిత్ర విజయానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. భాషా చిత్రం తర్వాత రజనీ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా ఆప్టే కథానాయికగా నటిస్తోంది. ఇందుకోసం సంతోష్ నారాయణన్ ఇచ్చిన సరికొత్త ట్యూన్స్ ఎనర్జిటిక్ గా సాగుతూ ఉర్రూతలూగిస్తున్నాయి. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి ఈ నెల 15 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.