సాధారణంగా హీరోలు ఇతర భాషల్లో నటించగా సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదల చేస్తుంటారు. కానీ.. మొట్టమొదటిసారి ఒక హీరోయిన్ క్రేజ్ ను బేస్ చేసుకొని ఆమె నటించిన చిత్రాన్ని డబ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇటీవల “తొలిప్రేమ” చిత్రంతో మంచి హిట్ సొంతం చేసుకోవడంతోపాటు నితిన్ సరసన “శ్రీనివాస కళ్యాణం” సినిమా సైన్ చేసి మంచి ఫామ్ లో ఉన్న రాశీఖన్నా మలయాళంలో నటించిన మొదటి సినిమా “విలన్”ను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు.
మోహన్ లాల్, విశాల్, హన్సిక, శ్రీకాంత్ లు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీఖన్నా కీలకపాత్ర పోషించింది. మలయాళంలో మంచి హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని “పులిజూదం” పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేనప్పటికీ.. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పోలీస్ మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.