‘మొహెంజదారో’ ట్రైలర్ విడుదల..

అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో హృతిక్ రోషన్,పూజా హెగ్డే లు జంటగా నటిస్తున్న చిత్రం ‘మొహెంజదారో’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజు చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఎంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఈ చిత్రంలో శర్మన్ పాత్రలో ఓ రైతుగా హృతిక్ కనిపించగా.. చాని పాత్రలో పూజా ఎంతో అందంగా కనిపిస్తోంది. క్రీస్తు పుట్టకముందు 2016 సంవత్సరంలో సింధు నాగరికత ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏ‌ఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నాడు. డిస్నీ ఇండియా, అశుతోష్ గోవరికర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 12 న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus