మోక్షజ్ఞ…తొలి సినిమా త్రివిక్రమ్ చేతుల్లో???

టాలీవుడ్ లో నందమూరి వంసానికి ఉన్న పేరు అంతా..ఇంతా కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే టాప్ ఫ్యామిలీస్ లో టాప్ గా ఉంటుంది ఏ ఫ్యామిలీ. అయితే అదే క్రమంలో అలనాటి టాలీవుడ్ టాప్ హీరో, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావుగారి నటవారసుడిగా ఎన్నో..ఎన్నెనో చరిత్రలు సృష్టించే సినిమాలు తీసి ఒక లెజెండ్ గా అభిమానుల మన్నలను అందుకుంటున్నారు మన నట సింహం బాలకృష్ణ.

అయితే ఆయన 100వ చిత్రంగా శాతకర్ణి తెరకెక్కుతున్న క్రమంలోనే, ఆయన నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై టాలీవుడ్ వేడెక్కింది. ఇప్పటికీ బాలయ్య దీనిపై కసరత్తులు చేసి, దాదాపుగా రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, కొరటాల శివ లాంటి బడా దర్శకులతో కుమారుడి ఎంట్రీ ఇవ్వాలి అని అనుకున్నాడు. అంతేకాకుండా వీరిలో ఎవరితో చేస్తే బావుంటుంది అని సలహాలు సైతం సేకరించగా….ఎక్కువశాతం త్రివిక్రమ్ ను సూచించసినట్లు సమాచారం, దానికి కారణం ఏంటి అంటే….మిగిలిన ముగ్గురూ అయితే భారీ అంచనాలు, మాస్ ఆడియన్స్ లో అంచనాలు, ఫ్యాన్స్ అంచనాలు భారీగా ఉంటాయని, తొలి సినిమాకి ఈ రేంజ్ అంచనాలు పెంచడం మంచిది కాదని బాలయ్య భావిస్తున్నారట.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలను వారి ఇమేజ్ కి తగ్గట్టు, నితిన్ లాంటి కుర్ర హీరోతో ‘అఆ’ చిత్రం చేసి విజయం సాధించిన త్రివిక్రమ్ తో మోక్షజ్ఞ తొలి సినిమా చేయించడం బెటర్ అని తెలిపినట్లు సమాచారం. ఇక బాలయ్య సైతం దీనిపై ఆలోచిస్తూ త్వరలోనే త్రివిక్రమ్ ను అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరి నటసింహం అడిగితే త్రివిక్రమ్ కాదంటాడా చెప్పండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus