హీరోగా కెరీర్ మొదలెట్టే ముందు సినిమా మీద అవగాహన పెంచుకోవడం కోసం సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్టులలో పనిచేయడం అన్నది మన హీరోలు ఎప్పట్నుంచో పాటిస్తున్న పద్దతే. చాలా మంది ఎక్కువగా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయడానికి ఇష్టపడతారు.
నాని, సందీప్ కిషన్ వంటి యువ కథానాయకులు అలా అసిస్టెంట్ దైరేక్తర్లుగా కెరీర్ లను మొదలుపెట్టి.. ఆ తరువాత హీరోలుగా మారినవారే. ఇప్పుడు అదే పద్ధతిలో నందమూరి వంశం మూడో తరం కథానాయకుడు, నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయుడు మోక్షజ్ఞ కూడా పయనిస్తానంటున్నాడు.
అతిత్వరలో హీరోగా రంగప్రవేశం చేయనున్న మోక్షజ్ఞ ముందుగా.. తన తండ్రి కథానాయకుడిగా తెరకెక్కుతున్న 100వ సినిమా అయిన “గౌతమీపుత్ర శాతకర్ణి” చిత్రానికి దర్శకుడు క్రిష్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేయనున్నాడట. ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర కూడా పోషించనున్నాడని వినికిడి!