ఓటీటీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదని స్పానిష్ వెబ్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’. యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్ వివిధ భాషల్లో అనువాదమై అందరినీ అలరించింది. ఈ సిరీస్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ టీమ్ ప్రకటించింది. సిరీస్ ఇక అయిపోయింది.. అందులో ఇండివిడ్యువల్ పాత్రల వైపు వచ్చారు అనే కామెంట్స్ మరోసారి బలంగా వినిపిస్తున్న వేళ ‘మేం ఉన్నాం.. మళ్లీ వస్తున్నాం’ అనేలా అప్‌డేట్ ఇచ్చారు. ఇది ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ అనే చెప్పొచ్చు.
‘మనీ హెయిస్ట్’ సిరీస్ కొనసాగుతున్నట్టు ప్రకటిస్తూ ఈ మేరకు ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో కీలక పాత్ర ప్రధానంగా రూపొందిన ‘బెర్లిన్ సీజన్ 2’ మరికొన్ని రోజుల్లో స్ట్రీమింగ్ రానున్న నేపథ్యంలో ఈ ప్రకటన కచ్చితంగా హైప్‌ను తీసుకొస్తుందని చెప్పొచ్చు. ఇక గ్లింప్స్‌లో గత సీజన్లలోని కొన్ని సన్నివేశాలు చూపిస్తూ.. ‘డబ్బుతో మొదలైంది. తర్వాత బంగారం. ఆ తర్వాత వెలకట్టలేని నిధి. కానీ, పోరాటం పూర్తి కాలేదు’ అంటూ ప్రాజెక్టుపై ఆసక్తి రేకెత్తించారు
అయితే ‘మనీ హెయిస్ట్’ కొత్త సీజన్ రాబోతోందా? లేకపోతే అందులో ప్రధాన పాత్రధారులతో ఇంకేదైనా ఆలోచన చేశారా? అనేది తెలియాల్సి ఉంది. సిరీస్ గురించి చూస్తే.. ఈ స్పానిష్ వెబ్‌సిరీస్ 1.3 బిలియన్ వ్యూయింగ్ అవర్స్‌తో ఓటీటీలో సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ రెండు భాగాల్లో కనిపించే కీలక పాత్ర బెర్లిన్ ‘మనీ హెయిస్ట్’కు చేసిన మరో దోపిడీతో రూపొందిన సిరీస్ ‘బెర్లిన్’. తొలి సీజన్ 2023లో రిలీజ్ కాగా.. సీజన్ 2 ఈ నెల 15 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.
‘మనీ హెయిస్ట్’ సిరీస్‌లకు వచ్చినంత పేరు, విజయం ‘బెర్లిన్’కి రానప్పటికీ.. ‘బెర్లిన్ 2’ విషయంలో పెద్ద ఎత్తున అంచనాలు అయితే ఉన్నాయి. మరిప్పుడు రెండో ‘బెర్లిన్’ ఏం చేస్తాడో చూడాలి. అది విజయం సాధిస్తేనే ‘మనీ హెయిస్ట్’లో ఇతర పాత్రల సిరీస్‌లు మరిన్ని వచ్చే అవకాశం ఉంది.