ఇలియానా అభిమానులారా కాస్త జాగ్రత్త వహించండి!

గోవా బ్యూటీ ఇలియానాకి కేవ‌లం సౌత్‌లోనే కాదు నార్త్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా గ్యాప్ త‌ర్వాత అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని అనే తెలుగు సినిమాలో న‌టించింది ఇల్లీ బేబి. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించనుంది. అయితే ఈ అమ్మ‌డిని అతిగా అభిమానిస్తే లేని పోని చిక్కులు తెచ్చుకోవ‌డం ఖాయం అంటున్నారు కంప్యూట‌ర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ సంస్థ‌. అమెరికన్ గ్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ మకా ఫీ (MCA Fee) నిర్వహించిన సర్వేలో ఇలియానా అత్యంత ప్రమాదకర సెలబ్రిటీగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇప్పటివరకు హాస్య నటుడు కపిల్ శర్మ ఉండేవాడు.

ఇటీవ‌ల హ్యాక‌ర్స్ ఇలియానా ఫోటోల‌ని విచ్చ‌ల‌విడిగా వాడేస్తూ కంప్యూట‌ర్స్‌ని హ్యాక్ చేస్తున్నార‌ట‌. ఆమె ఫోటోతో ఉన్న లింక్‌గాని, ఆమెకి సంబంధించిన ఏదైన రూమ‌ర్స్‌తో వ‌చ్చిన లింక్స్ గాని క్లిక్ చేశారో, మీ సిస్ట‌మ్‌లో ఉన్న డాటా మొత్తం హ్యాకర్స్ చేతికి వెళ్ల‌డం ఖాయం అంటున్నారు. అందుకే MCA Fee ఇలియానాను ‘మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ’గా ప్రకటించింది. ఇలియానా తర్వాతి రెండు స్థానాల్లో ప్రీజి జింటా, టబ్ ఉన్నారు. వీరితోపాటు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, కృతి సనన్, అక్షయ్ కుమార్, రిషీ కపూర్, పరిణితీ చోప్రా, గోవిందాలు కూడా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus