కథానాయికలకు అందం, అభినయం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అలాగే.. సదరు కథానాయికలకు ఆత్రం కూడా అంతే తక్కువగా ఉండాలి. కానీ.. మన రష్మిక మండన్నకి అందం, అభినయ సామర్ధ్యంతోపాటు ఆత్రం కూడా ఎక్కువే. అందుకే.. కార్తీ హీరోగా తమిళంలో ఆమె నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ను ప్రొడక్షన్ హౌస్ ప్రకటించడానికంటే ముందే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించేసి వారి కోపాగ్నికి కారకురాలైంది.
విషయం ఏమిటంటే.. కార్తీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రానికి “సుల్తాన్” అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని ఒక మంచి డేట్ చూసి ఎనౌన్స్ చేద్దామనుకొన్నారు చిత్రబృందం. కానీ.. రష్మిక ఈలోపే తన ఇన్స్టాగ్రమ్ ద్వారా అందరికీ చేప్పేసింది. దాంతో ప్రొడక్షన్ హౌస్ ఆమెపై సీరియస్ అయ్యిందట. రష్మిక క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. ఎంతైనా హీరోయిన్ కదా ఏం చేస్తారు చెప్పండి.. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు అని మందలించి ఉరుకున్నారట. అందుకే అంటారు తొందరపడి కూయకమ్మా కోయిలా అని.