శుక్రవారం సినిమాల సందడి

  • February 15, 2018 / 06:39 AM IST

గతవారం విడుదలైన చిత్రాల్లో ‘తొలిప్రేమ’ మినహా ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించకపోవడం, హిందీ ‘ప్యాడ్ మ్యాన్’ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో వేరే సినిమాలేమ్ లేక ఢీలాపడ్డారు జనాలు. కానీ.. ఈవారం మాత్రం మూవీ లవర్స్ కి ఫుల్ దిల్ కుష్. అందుకు కారణం తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల నుంచి ఈ వారం ఆసక్తికరమైన సినిమాలు విడుదలవుతుండడం.
తెలుగులో నాని నిర్మించగా కాజల్, నిత్యామీనన్, రెజీనా ముఖ్యపాత్రల్లో నటించిన “అ!”, మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతూ సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా తెరకెక్కించిన “మనసుకి నచ్చింది”తోపాటు “రచయిత, సోడా గోలీసోడా” అనే మరో రెండు తెలుగు సినిమాలు కూడా రిలీజవుతున్నాయి.

వీటితోపాటు రకుల్ ప్రీత్ హిందీలో నటించిన “అయ్యారి” కూడా రేపు విడుదలవుతోంది. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడిన అనంతరం రేపు రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక వీటన్నిటికంటే ముఖ్యంగా అందరూ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “బ్లాక్ పాంతర్” చిత్రం రేపు విడుదలవుతోంది. “మార్వెల్ పిక్ఛర్స్” సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతోపాటు “ఎవెంజర్స్” సిరీస్ లోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాగ్రౌండ్ ఉన్న క్యారెక్టర్ కావడంతో “బ్లాక్ పాంతర్” ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో, ఈ వీకెండ్ మొత్తం మూవీ లవర్స్ కి పండగేనన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus