ఈ శుక్రవారం సినిమాల సందడి

  • August 22, 2018 / 01:05 PM IST

సాధారణంగా వారానికి నాలుగైదు సినిమాలు రిలీజవుతుంటేనే మూవీల్ లవర్స్ కి పండగ అలాంటిది ఏకంగా ఈవారం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషా సినిమాలతో కలిపి 8 సినిమాలు విడుదలవుతున్నాయి. గతవారం విడుదలైన “గీత గోవిందం” థియేటర్లలో ఇంకా హల్ చల్ చేస్తున్నప్పటికీ.. ఈవారం ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. “నీవెవరో, లక్ష్మీ, ఆటగాళ్లు, అంతకుమించి” అనే నాలుగు సినిమాలు విడుదలవుతుండగా వీటిలో ఆది పినిశెట్టి, తాప్సీ, రీతికా సింగ్ హీరోయిన్లుగా నటించిన “నీవెవరో”, ప్రభుదేవా కీలకపాత్రలో రూపొందిన “లక్ష్మీ” చిత్రాలపైనే ప్రేక్షకుల దృష్టి ఉంది.

వీటితోపాటు “హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగీ” అనే హిందీ సినిమా కూడా విడుదలవుతోంది. దీంతోపాటు “జీనియస్” అనే మరో హిందీ సినిమా కూడా విడుదలవుతోంది. హిందీ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “గదర్” చిత్ర దర్శకుడు తన తనయుడ్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అలాగే “మైల్ 22, ఆల్ఫా” అనే రెండు హాలీవుడ్ యాక్షన్ మూవీస్ కూడా విడుదలవుతున్నాయి. సో, ఇన్ని వైవిధ్యమైన చిత్రాలు విడుదలవుతున్న ఈ శుక్రవారం మూవీ లవర్స్ కి ఫుల్ మీల్స్ పంచుతుందో లేక థియేటర్లో కూర్చోబెట్టి అర్ధాకలితో ఎండగడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus