ఆశాజనకంగా లేని శుక్రవారం విడుదలలు

  • October 25, 2018 / 01:22 PM IST

సాధారణంగా వారానికి నాలుగైదు సినిమాలు రిలీజవుతుంటేనే మూవీల్ లవర్స్ కి పండగ అలాంటిది ఏకంగా ఈవారం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషా సినిమాలతో కలిపి 11 సినిమాలు విడుదలవుతున్నాయి. అయినప్పటికీ.. ఈవారం బోరింగ్ వీకెండ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. 11 సినిమాలు విడుదలవుతున్నప్పటికీ, వాటిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా అంచనాలు కాదు కదా కనీసం ఇంట్రెస్ట్ పెంచే స్థాయి సినిమా లేకపోవడం గమనార్హం. తెలుగులో “వీరభోగవసంతరాయులు, 2 ఫ్రెండ్స్, బంగారి బాలరాజు, రధం, భాగ్యనగరం, ఐశ్వర్యాభిమస్తు” లాంటి చిత్రాలు విడుదలవుతుండగా..

వీటిలో కాస్తో కూస్తో ఎక్స్ పెక్టేషన్స్ “వీరభోగ వసంతరాయులు” మీద ఉండేది. ఆ అంచనాలన్నీ నిన్నటి స్పెషల్ ప్రీమియర్ కారణంగా మాయమైపోయాయి. సో, హిందీ సినిమా “బజార్” మరియు ఇంగ్లీష్ ఫిలిమ్ “హంటర్ కిల్లర్’ సినిమాల మీద మాత్రమే మూవీ లవర్స్ కి అంచనాలున్నాయి. ఈ సినిమాలు ఏమేరకు ఆకట్టుకుంటాయో తెలియదు కానీ.. రెగ్యులర్ మూవీ లవర్స్ మాత్రం ఈవారం ఏం చేయాలో తోచక తికమకపడుతున్నారు. అయితే.. వచ్చేవారం మాత్రం అన్నీ మంచి సినిమాలు క్యూ కట్టాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus