3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాతో తమిళ సినిమాల్లోకి వచ్చి.. ‘గద్దలకొండ గణేశ్‌’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మృణాళిని రవి. ఆ తర్వాత కొన్ని రోజులు తెలుగు సినిమాలో నటించని ఆమె తర్వాత మరో రెండు సినిమాలు చేసింది. ఆ విషయాలు తర్వాత చూద్దాం. ఇప్పుడు వ్యక్తిగత విషయం ఒకటి చూద్దాం. ఆమె ఆమె ఎంగేజ్‌మెంట్‌. మృణాళిని తన వ్యక్తిగత జీవితంలో ఓ కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఆమెనే అధికారికంగా ప్రకటించింది.

Mirnalini Ravi

తన చిరకాల మిత్రుడు మహావిష్ణుతో ఆమె ఎంగేజ్ మెంట్ అయింది. ‘‘నిన్ను ప్రేమించడం చివరికి నన్ను నేను ప్రేమించుకోవడంలా అనిపిస్తుంది” అంటూ ఆ ఫొటోతో పాటు రాసుకొచ్చింది మృణాళిని. మరోవైపు మహావిష్ణు కూడా సోషల్ మీడియాలో ఈ విషయం షేర్‌ చేశాడు. ఏడేళ్లకు పైగా మృణాళినితో తనకు పరిచయం ఉందని, ఆ స్నేహం ప్రేమగా మారిందని, ఇప్పుడది మరో బంధంలోకి అడుగుపెట్టిందని వివరంగా రాసుకొచ్చాడు..

ఇక పై చెప్పిన సినిమాల సంగతి చూస్తే.. ‘గద్దలకొండ గణేశ్‌’ సినిమా తర్వాత నాలుగేళ్లకు తెలుగులో ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’, ‘మామ మశ్చీంద్ర’ సినిమాలు చేసింది. ఇక తమిళ సినిమాల సంగతి చూస్తే.. రెండేళ్ల క్రితం వచ్చిన ‘రోమియో’ సినిమానే ఆఖరు. విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపే వచ్చింది. అయితే ఏమైందో ఏమో ఆ తర్వాత సినిమాలేవీ చేయలేదు.

సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ఈ సమయంలో ఎంగేజ్‌మెంట్ న్యూస్‌ ఇచ్చి షాకిచ్చింది మృణాళిని. ఇక మహావిష్ణు సంగతి చూస్తే.. అతనొక స్పిరుట్యువల్‌ టీచర్‌. పరంపొరుల్‌ అనే ఆర్గనైజేషన్‌ని రన్‌ చేస్తున్నారు.

9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus