‘సైరా’ నుండీ మొదటి పాట వచ్చేస్తుంది

  • September 4, 2019 / 06:09 PM IST

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం అక్టోబర్ 2 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కాబోతుంది. ఈమధ్యే విడుదల చేసిన టీజర్ కు కూడా అద్భుతమైన స్పందన లభించింది. అసలే పెద్ద బడ్జెట్ చిత్రం అందులోనూ విడుదలకు 4 వారలు మాత్రమే సమయం ఉంది కాబట్టి ప్రమోషన్ల డోస్ పెంచబోతున్నారు.

ఈ క్రమంలో మొదటి సింగిల్ విడుదల చేయడానికి రెడీ అవుతున్నారట. సెప్టెంబర్ 2 వ వారంలో ‘సైరా’ నుండీ మొదటి పాటను విడుదల చేయాలనీ ఫిక్సయ్యారట. అమిత్ త్రివేది సంగీతంలో తెరకెక్కిన ‘సైరా’ మొదటి పాట అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆ లిరికల్ సాంగ్ విడుదల చేసిన కొన్ని రోజులకే ఆ సాంగ్ కు సంబందించిన వీడియో ప్రోమోని కూడా విడుదల చేస్తారని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. తమన్నా, అనుష్క,అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి నటీనటులు కూడా కీలక పాత్రలు పోషించబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus