సూపర్ స్టార్ మహేష్ బాబుని చూడగానే ఎంతోమంది అమ్మాయిల్లో వెలుగు కనిపిస్తుంది. మరి ప్రిన్స్ కళ్లల్లో ఆనందం చూడాలంటే ఎదురుగా ఎవరుండాలి..? ఇంకెవరు నమ్రత శిరోద్కర్. గతంలో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న ఈమెను సూపర్ స్టార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మోడలింగ్, నటనకు స్వస్తి పలికి నమ్రత ఇంటికే పరిమితమయి, మహేష్, తమ పిల్లలు గౌతమ్, సితార బాగోగులు చూసేందుకు సమయాన్ని కేటాయించింది. మంచి భార్యగా, గొప్ప తల్లిగా బాధ్యతలను నెరవేరుస్తోంది.ఈ రోజు నమ్రత పుట్టినరోజు కావడంతో మహేష్ తన సతీమణికి సోషల్ మీడియా వేదికగా ఎంతో ప్రేమతో శుభాకాంక్షలు తెలిపారు.
“నా జీవితానికి వెలుగు, నాకు బలమైన.. నా ప్రియమైన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ తనదైన శైలిలో విషెష్ చెప్పారు. వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచే ప్రిన్స్ ఇలా ట్వీట్ చేయడంతో మహేష్ అభిమానులు ఆనందపడ్డారు. వారు కూడా నమ్రతకు బర్త్ డే విషెష్ చెప్పారు. ప్రస్తుతం మహేష్ బాబు, తమిళ దర్శకుడు మురుగ దాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.