Mysaa: ‘మైసా’ మూవీ గ్లిమ్ప్స్ రివ్యూ.. రష్మిక ఇంకో హిట్టు కొట్టేలా ఉందిగా

రష్మిక మందాన ఇప్పుడు వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ వస్తోంది. ఇటీవల ‘ది గర్ల్ ఫ్రెండ్’ తో సాలిడ్ హిట్ అందుకుంది. అలాగే ‘ధామ’ అనే సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అది కూడా బాగానే ఆడింది. ఇప్పుడు ‘మైసా'(Mysaa) అనే విమెన్ సెంట్రిక్ మూవీ చేస్తుంది. ఇందులో ఆమె ఓ పవర్ఫుల్ గిరిజన యువతిగా కనిపించనుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించిన ఈ సినిమాని అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోపా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Mysaa

జెక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తాజాగా ‘మైసా’ కి సంబంధించిన టీజర్ ను వదిలారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయ్యింది.ఈ టీజర్ విషయానికి వస్తే ఇది 1:21 నిమిషాల నిడివి కలిగి ఉంది. రష్మిక తల్లిగా ఈ సినిమాలో ఈశ్వరి రావు నటిస్తున్నట్టు ఉన్నారు. ఆమె వాయిస్ ఓవర్లో టీజర్ మొదలైంది. ఒక చేతికి సంకెళ్లు, మరో చేతిలో తుపాకీ ఉండటాన్ని గమనించవచ్చు.

ఆమె ఎడమకాలికి రక్తం కారుతుండటాన్ని గమనించవచ్చు.అలాగే ఎదురుగా ప్రత్యర్ధులు దాడి చేయడానికి వస్తున్నారు. అయినా భయపడకుండా ధైర్యంగా హీరోయిన్(రష్మిక) నిలబడటం.. అక్కడ ఆమెకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో, పవర్ఫుల్ డైలాగ్స్ తో ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది.రష్మిక లుక్ పరంగా కొత్తగా ఏమీ లేదు. ఆమె పాత్రకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఇందులో చూపించారు. సినిమాటోగ్రాఫర్ వర్క్ హై లెవల్లో కనిపించింది. గ్లిమ్ప్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus