అల్లు అర్జున్ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం రోజే ఖరారైన రిలీజ్ డేట్

  • August 2, 2017 / 01:56 PM IST

దువ్వాడ జగన్నాథం చిత్రం తర్వాత ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమా చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడిగా కనిపించనున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు ప్రారంభమయింది. షూటింగ్ తొలిరోజే చిత్ర బృదం రిలీజ్ డేట్ ని ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులకు ఎదురుచూపులు తగ్గింది. ఈ విధానం వల్ల ఇతర హీరోల సినిమాల క్లాష్ బెడద కూడా తగ్గుతుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.

శరత్ కుమార్ కీలకరోల్ పోషించనున్న ఇందులో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. ఈ చిత్రంలో డిఫెరెంట్ లుక్ కోసం బన్నీ రీసెంట్ గా అమెరికాకి వెళ్లారు. అక్కడి నిపుణుల సమక్షంలో బాడీని మలుచుకున్నారు. ప్రతి చిత్రంలో కొత్త లుక్ ట్రై చేసే స్టైలిష్ స్టార్ ఇందులో ఎలా కనిపించబోతున్నారోనని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus