అల్లు అర్జున్ సినిమా కోసం తమిళ టాప్ లిరిక్ రైటర్.!

  • March 21, 2018 / 01:32 PM IST

అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “నా పేరు సూర్య” (Naa Peru Surya) చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే. తెలుగుతోపాటు తమిళంలోనూ ఒకేరోజు విడుదల చేస్తారా లేక తెలుగు రిజల్ట్ బట్టి తమిళ రిలీజ్ డేట్ ను డిసైడ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రానికి తమిళంలో మాటలు, పాటలు సమకూర్చేందుకు పా.విజయ్ అనే సీనియర్ రచయితను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయన తమిళ డైలాగ్ వెర్షన్ ను సిద్ధం చేస్తున్నాడట.

ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం “నా పేరు సూర్య” ఆఖరి షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మే 4న విడుదలవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ స్టఫ్ ప్రస్తుతం మేకింగ్ లో ఉంది. అలాగే. ఏప్రిల్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అల్లు అర్జున్ సరసన అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తుండగా. లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus