సినిమా రిలీజ్ కి ఆరు నెలల ముందు ఫస్ట్ ఇంపాక్ట్ అనీ, ఫస్ట్ సాంగ్ అనీ పోలోమని ప్రమోషన్స్ చేసిన ‘నా పేరు సూర్య‘ చిత్ర బృందం.. సినిమా విడుదల తేదీకి (మే 4) ఇంకా పట్టుమని నెలరోజులు కూడా లేనప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయింది. ఈలోపు రామ్ చరణ్ “రంగస్థలం”తో చిట్టిబాబుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సమీకరణలు సృష్టించాడు. ఏప్రిల్ 20న విడుదలవుతున్న “భరత్ అనే నేను” ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ బృందం మాత్రం ఏ మాట చెప్పకపోవడంతో అభిమానులందరూ కంగారుపడుతూ వచ్చారు.
మరి అభిమానుల ఆవేదనను అర్ధం చేసుకొన్నారో లేక నిజంగానే సినిమా ప్రమోషన్స్ టైమ్ దగ్గరపడిందని భావించారో తెలియదు కానీ.. పర్టీక్యులర్ గా డేట్ ప్రకటించకుండా త్వరలోనే ఆడియో విడుదల అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో అల్లు అర్జున్ అభిమానులకు హాట్ సమ్మర్ లో కూల్ వాటర్ ఇచ్చినట్లైంది. అయితే.. ఆడియోను ఏప్రిల్ రెండోవారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం వెన్యూ ఫైనల్ హీరో & డైరెక్టర్ బిజీగా ఉన్నారు. సో సూర్య బ్యాక్ టు ట్రాక్ అన్నమాట. అల్లు అర్జున్ సరసన అను ఎమ్మాన్యూల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వక్కంతమ్ వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.