భారీ ధరలకు అమ్ముడుపోయిన నా పేరు సూర్య రైట్స్.!

రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం అవుతున్న మూవీ “నా పేరు సూర్య“. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోల్జర్ గా కనిపించనున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీధర్, బన్నీ వాసులు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కొత్త డైరక్టర్ అయినప్పటికీ బన్నీ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ హక్కుల ద్వారానే 26కోట్లు రాబట్టిన ఈ మూవీ థియేటర్ రైట్స్ లోను అదే జోరు కొనసాగించింది. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్‌కుమార్, నదియా వంటి స్టార్ కాస్టింగ్ ఉండడంతో రిలీజ్ కి ముందుగానే వివిధ ప్రాంతాల వారు నా పేరు సూర్యను 80కోట్లు చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఏరియాల వారీగా కొనుగోలు చేసిన మొత్తం… కోట్లల్లో..

నైజాం : 21
సీడెడ్ : 12Naa Peru Suryaఉత్తరాంధ్ర : 8
ఈస్ట్ : 5.4Naa Peru Suryaవెస్ట్ : 4.2
కృష్ణ : 5Naa Peru Suryaగుంటూరు : 5.5
నెల్లూరు : 2.52

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్ రైట్స్ కూడా పోటీపడి సొంతం చేసుకున్నారు. పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus