‘అంథాధూన్’ రీమేక్ పై నభా నటేష్ కామెంట్స్!

Advertisement

రెండేళ్ల క్రితం బాలీవుడ్ లో విడుదలైన ‘అంథాధూన్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్ గా కనిపించగా.. టబు కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు హీరో నితిన్. దీనికి సంబంధించిన కాస్టింగ్ సెలక్షన్ కూడా పూర్తయింది. హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకున్నారు. అయితే ఒరిజినల్ వెర్షన్ లో చూపించినట్లు ఇందులో కూడా హీరో-హీరోయిన్ల మధ్య హాట్ రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయా..?

లిప్ లాక్, మితిమీరిన ఘాటు రొమాన్స్ ని చూపిస్తారా..? ఇవన్నీ తెలిసే నభా నటేష్ ఒప్పుకుందా..? అనే సందేహాలు కలిగాయి. తాజాగా ఈ సందేహాలన్నింటికీ సమాధానాలిచ్చింది ఈ హాట్ బ్యూటీ. ‘అంథాధూన్’ రీమేక్ లో తన పాత్రకు సౌత్ టచ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అంటే హిందీలో రాధికా చేసినట్లు రొమాంటిక్ సీన్లలో నటించాల్సిన అవసరం లేదని పరోక్షంగా చెప్పింది. నభా పాత్రకు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే కాదు.. టబు పోషించిన నెగెటివ్ రోల్ లో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

అలా మార్పులు చేసిన తరువాత తమన్నా ఆ పాత్రలో నటించడానికి అంగీకరించిందని సమాచారం. ఈ నెలాఖరు నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని నభా వెల్లడించింది. ఈ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయబోతున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news